శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు | Five permanent judges appointed to the High Court soon | Sakshi
Sakshi News home page

శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు

Sep 24 2026 4:39 AM | Updated on Sep 24 2026 4:39 AM

Five permanent judges appointed to the High Court soon

సీజేఐ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు 

రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడగానే ప్రమాణ స్వీకారం  

సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పని చేస్తున్న ఐదుగురిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సిఫారసు చేసింది. బుధవారం సమావేశమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ మేరకు సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన వారిలో న్యాయమూర్తులు జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు, జస్టిస్‌ తూటా చంద్ర ధనశేఖర్‌ (టీసీడీ శేఖర్‌), జస్టిస్‌ చల్లా గుణరంజన్, జస్టిస్‌ అవధానం హరి హరనాథ శర్మ, డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు ఉన్నారు. 

రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన తర్వాత వీరు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ఐదుగురిలో జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు, జస్టిస్‌ తూటా చంద్ర ధనశేఖర్, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ 2024 అక్టోబర్‌ 28న.. జస్టిస్‌ అవధానం హరి హరనాథ శర్మ, డాక్టర్‌ జస్టిస్‌ డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు 2025 జనవరి 24న హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ఇప్పుడు వీరిని అదనపు న్యాయమూర్తుల నుంచి శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement