దాడికి సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు అందించాం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Meets AP Governor Abdul Nazeer Demands CBI Probe into Alleged DSC Scam | Sakshi
Sakshi News home page

దాడికి సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు అందించాం: వైఎస్‌ జగన్‌

Sep 23 2026 10:17 PM | Updated on Sep 23 2026 10:17 PM

YS Jagan Meets AP Governor Abdul Nazeer Demands CBI Probe into Alleged DSC Scam

తాడేపల్లి: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన విషయాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తాము ఏ అంశాలపై ఫిర్యాదు చేసిందీ వివరించారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలతో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశానని తెలిపారు.

‘‘శాప్ కార్యాలయం వద్ద జరిగిన దాడి వివరాలను గవర్నర్‌కు అందించాం. శాంతియుతంగా నిరసన చేపట్టిన మా పార్టీ నేతలు, కార్యకర్తలు, నిరుద్యోగ యువతపై జరిగిన దాడికి సంబంధించిన ఆధారాలను కూడా అందించాం. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, భారీ స్కాం గురించి గవర్నర్‌కు వివరించాం. 

మా పార్టీ  నేతలు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు,  అక్రమ అరెస్టులు.. చట్టపరంగా నిలబడలేని కేసుల నమోదు అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ఈ పోలీసు చర్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని.. డీఎస్సీ స్కాంపై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలని కోరాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో రాజీనామా చేయించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాము’’ అని వైఎస్ జగన్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement