‘సాక్షి’పై ఆగని బాబు సర్కార్‌ కుట్రలు | Chandrababu Govt Blocks Sakshi Social Media Accounts | Sakshi
Sakshi News home page

‘సాక్షి’పై ఆగని బాబు సర్కార్‌ కుట్రలు

Sep 23 2026 8:28 PM | Updated on Sep 23 2026 9:05 PM

Chandrababu Govt Blocks Sakshi Social Media Accounts

సాక్షి, అమరావతి: సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పరాకాష్టకు చేరాయి. సాక్షిపై చంద్రబాబు సర్కార్‌ మరోసారి అక్కసు వెళ్లగక్కింది. మరో ఫేస్‌బుక్, రెండు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను బ్లాక్‌ చేయించింది. గతంలో కూడా సాక్షి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా అకౌంట్లను కూటమి ప్రభుత్వం నిలిపివేయించిన సంగతి తెలిసిందే. అరాచకాలు, అక్రమాలను ప్రశ్నిస్తూ.. వాస్తవాలను బయటపెడుతున్న సాక్షి అంటే కూటమి సర్కార్‌కు భయం పట్టుకుంది. దీంతో కుట్రలతో చెలరేగిపోతుంది.

రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ­కు చంద్రబాబు సర్కార్‌ తూట్లు పొడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధి­కా­రంలోకి వచ్చాక సాక్షి మీడి­యాను ఇబ్బందులకు గురిచేస్తోంది. కక్ష సాధింపు­ చర్యలకు దిగుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ‘సాక్షి’పై చెలరేగిపోతున్న పచ్చ బ్యాచ్‌.. పత్రికా స్వేచ్ఛను, వాక్‌ స్వాతంత్ర హక్కును కాల రాస్తోంది.

ఇదీ చదవండి: అన్ని ఆధారాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం: వైఎస్‌ జగన్‌

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement