చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కోసం కొత్త పాలసీ | AP Cabinet Approves Controversial Policy: Government Salaries for Social Media Influencers | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కోసం కొత్త పాలసీ

Sep 23 2026 8:11 PM | Updated on Sep 23 2026 9:11 PM

AP Cabinet Approves Controversial Policy: Government Salaries for Social Media Influencers

సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో ప్రజాధనాన్ని కూటమి ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తోందనడానికి కేబినెట్ నిర్ణయమే నిదర్శనంగా నిలుస్తోంది. చంద్రబాబు తన సెల్ఫ్ డబ్బా కోసం ఏకంగా ప్రభుత్వ ఖజానా నుంచే నిధులను మళ్లించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటున తన సొంత పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రభుత్వ నిధులతో జీతాలు చెల్లించేందుకు తెరతీశారు. ఈ వింత పాలసీకి ఏపీ కేబినెట్ సైతం ఆమోదం తెలిపింది.

సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీకి అనుకూలంగా, ప్రభుత్వానికి వత్తాసుగా పోస్టులు పెట్టే ఇన్‌ఫ్లుయెన్సర్లకు నెలకు రూ.15,000, రూ.7,500, రూ.5,000  రూ.2,500 చొప్పున జీతాలు చెల్లించనున్నారు. ఇందుకోసం పార్టీకి అనుకూలంగా పనిచేసే డిజిటల్ క్రియేటర్లను ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయనున్నారు.

ఇలా అర్హత సాధించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తించి, వారి వివరాలను ధృవీకరించి ఒక అధికారిక జాబితాలో చేర్చడానికి (ఎంప్యానెల్ చేయడానికి) ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఎంప్యానెల్‌మెంట్ ప్రక్రియను, అధికారిక జాబితా రూపకల్పనను ‘ఏపీడీసీఎల్’ (ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్) ద్వారా పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఏజెన్సీ ద్వారా ఎంపికైన  వారికి మాత్రమే ప్రభుత్వ నిధుల నుంచి నేరుగా జీతాలు చెల్లిస్తారు.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ఎక్స్‌ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రభుత్వ అనుకూల ప్రచారంతో పాటు వ్యక్తిగత ప్రచారం కోసం ఈ వేదికలను వాడుకోనున్నారు. ఎంపిక చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఏకంగా ఏడాది పాటు క్రమం తప్పకుండా ప్రభుత్వ నిధుల నుంచి జీతాలు చెల్లించేలా విధివిధానాలు ఖరారు చేశారు. ప్రజల పన్నుల ద్వారా వచ్చే ఖజానా సొమ్మును సంక్షేమం కోసం కాకుండా, అధికార పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలుగా చెల్లించి సెల్ఫ్ ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement