సాక్షి, విశాఖపట్నం: బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతుంది. కళింగపట్నానికి 30, విశాఖకు 90 కిలోమీటర్ల దూరంతో వాయుగుండం కేంద్రీకృతమైంది. వజ్రపు కొత్తూరు- భోగాపురం మధ్య తీరం దాటనుంది. కరిపేట బీచ్ వద్ద రాత్రి 11 గంటలకు తీరం దాటవచ్చిని వాతావరణ శాఖ అంచన వేస్తుంది. తీరం దాటేటప్పుడు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
మరోవైపు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు పడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చింతలపాడులో గాలులు భీకరంగా వీచాయి. ఈదురుగాలుల బీభత్సానికి గ్రామమంతా అతలాకుతమలమైంది. గాలులు ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. దీంతో రేకులు తగిలి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే విధంగా భారీ స్థాయిలో వృక్షాలు స్తంభాలు నేలకొరిగాయి.


