మజారె పావ్‌బాజీ.. బిర్యానీ భోజీ | Five Cities From India Feature In The Top 100 List Globally, See Details Inside - Sakshi
Sakshi News home page

మజారె పావ్‌బాజీ.. బిర్యానీ భోజీ

Dec 29 2023 5:40 AM | Updated on Dec 29 2023 1:41 PM

Five cities from India feature in the top 100 list globally - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలోని నగరాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో స్థానిక ఆహార పదార్థాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. వీధి చివరిలోని స్టాల్స్‌ నుంచి ఐకానిక్‌ హోటళ్ల వరకు నోరూరించే రుచులు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ఢిల్లీ, ముంబై వడాపావ్, చాట్‌ బఠాణి, హైదరాబాద్‌ బిర్యానీ, చెన్నై ఇడ్లీ–దోశ, లక్నో కబాబ్‌–మొగలాయ్‌ వంటకాలు ఎల్లలు ఎరుగని ఆహార ప్రేమికులను సొంతం చేసుకుంటున్నాయి.

ఒక ప్రాంత సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించడంలో పాకశాస్త్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని రుచుల ఎన్‌సైక్లోపిడియాగా పిలిచే ‘టేస్ట్‌ అట్లాస్‌’ సంస్థ పేర్కొంది. తాజాగా ‘ప్రపంచంలోని ఉత్తమ ఆహార నగరాల’ జాబితాను విడుదల చేసింది. ఇందులో టాప్‌–100లో భారతదేశం నుంచి ఐదు నగరాలకు స్థానం దక్కింది. టేస్ట్‌ అట్లాస్‌ ‘ట్రావెల్‌ గ్లోబల్‌ ఈట్‌ లోకల్‌’ నినాదంతో ప్రాంతీయ రుచులకు పెద్దపీట వేస్తోంది. తద్వారా వ్యవసాయం, వాణిజ్యాన్ని బలోపేతం చేయొచ్చని భావిస్తోంది.

ఇటాలియన్‌ నగరాలే టాప్‌ 
♦ టేస్ట్‌ అట్లాస్‌ నివేదికలో ఇటాలియన్‌ నగరాల రుచుల హవా కనిపించింది. అగ్రస్థానంలో రోమ్‌ (ఇటలీ) ఆ తర్వాత బోలోగ్రా, నేపుల్స్‌ నగరాలు నిలిచాయి. మొత్తం మూడు ఇటాలియన్‌ నగరాల్లో పాస్తా, పిజ్జా, జున్ను ఆధారిత వంటకాలకు ప్రసిద్ధి చెందడం విశేషం. 
♦  ఉత్తమ రేటింగ్‌ పొందిన వంటకంగా బ్రెజిలియన్‌ మీట్‌ కట్‌ పికాన్హా, ఆ తర్వాత మలేషియన్‌ బ్రెడ్‌ రోటీ కనై , థాయ్‌ స్టిర్‌ ఫ్రై రెసిపీలు ఉన్నాయి.

హైదరాబాద్‌ బిర్యానీకి దేశంలో రెండో స్థానం 
♦ ప్రపంచ ఉత్తమ ఆహార నగరాల్లో ముంబై (35), హైదరాబాద్‌ (39) స్థానాలను దక్కించుకున్నాయి.  
♦ ఆ తర్వాత ఢిల్లీ (56), చెన్నై (65), లక్నో (92) స్థానాల్లో నిలిచాయి. ఇక్కడ పావ్‌ బాజీ, దోశ, వడపావ్, చోలే భాతురే, కబాబ్స్, నిహారీ, పానీ పూరీ, చోలే కుల్చే, బిర్యానీ, వివిధ రకా­ల చాట్‌లు కేవలం కడుపునింపే ఆహారంగానే కాకుండా జిహ్వకు సంతృప్తి, అత్యుత్తమ రుచిని అందిస్తాయని నివేదిక పేర్కొంది. 
♦ ఉత్తమ రెస్టారెంట్ల విషయంలో భారత్‌ 4.52 స్కోరుతో 11వ స్థానంలో నిలిచింది. 
♦ ఉత్తమ ఆహార పదార్థంగా బటర్‌ గార్లిక్‌ నాన్‌ 4.67 స్కోర్‌తో 7వ స్థానం, ముర్గ్‌ మఖానీ 4.54 స్కోర్‌తో 43వ స్థానం, టిక్కా 4.54 స్కోర్‌తో 47వ స్థానం, తందూరి 4.54 స్కోర్‌తో 48వ స్థానంలో నిలిచాయి.  
♦ ఉత్తమ అల్పాహారంగా శనగల కూరతో కూడిన పూరీ 18వ స్థానంలో ఉండగా.. అత్యంత ప్రసిద్ధ ఆహార స్థలాల్లో మంగుళూరులోని పబ్బా ఐస్‌ పార్లర్‌కు 7వ స్థానం దక్కింది.

ప్రపంచంలోని టాప్‌–10 ఆహార నగరాలు 
♦ రోమ్, ఇటలీ 
♦ బోలోగ్నా, ఇటలీ 
♦ నేపుల్స్, ఇటలీ 
♦  వియన్నా, ఆస్ట్రియా 
♦టోక్యో, జపాన్‌ 
♦ఒసాకా, జపాన్‌ 
♦ హాంకాంగ్, చైనా 
♦ టురిన్, ఇటలీ 
♦గాజియాంటెప్, టర్కీ 
♦బాండుంగ్, ఇండోనేషియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement