‘సీఎం జగన్‌కు మత్స్యకారులు రుణపడి ఉంటారు’ | Fishermen Are Indebted To CM Jagan: Vasupalli Ganesh | Sakshi
Sakshi News home page

‘సీఎం జగన్‌కు మత్స్యకారులు రుణపడి ఉంటారు’

Nov 21 2020 1:56 PM | Updated on Nov 21 2020 2:00 PM

Fishermen Are Indebted To CM Jagan: Vasupalli Ganesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాలి గోటికి కూడా చంద్రబాబు సరిపోడని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం జిల్లాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్యకారులకు ఇచ్చిన హామీలను అప్పట్లో చంద్రబాబు విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిదు కిలోమీటర్లుకు ఒక జెట్టి నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని గుర్తు చేశారు. మత్స్యకారులకు పింఛన్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. చదవండి: ఫిషింగ్‌ హార్బర్లకు సీఎం జగన్‌ శంకుస్థాపన

మత్స్యకార దినోత్సవం రోజు చంద్రబాబు కేవలం కేకు మాత్రమే కట్ చేసి.. మత్స్యకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే చంద్రబాబు కన్నెర్ర చేసేవారని ప్రస్తావించారు. నేడు నాలుగు షిప్పింగ్ హార్బర్స్‌కు శంకుస్థాపన చేసి సీఎం జగన్‌ చరిత్ర సృష్టించారన్నారు. వైఎస్‌ జగన్‌ పాలన మత్స్యకారులకు స్వర్ణయుగం వంటిదని కొనియాడారు. మత్స్యకారులు సీఎం జగన్‌కు రుణపడి ఉంటారని, మత్స్యకారులు ఇచ్చిన హామీలను సీఎం 17 నెలల్లోనే అమలు చేశారని ప్రశంసించారు.  పాకిస్తాన్‌లో చిక్కుకున్న మత్స్యకారులను  సీఎం జగన్ దేశానికి తిరిగి తీసుకువచ్చారన్నారు. చదవండి: సీఎం జగన్‌ని కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement