గుంటూరు: డాక్టర్ల నగ్న వీడియోల చిత్రీకరణ | Male Nurse Arrested For Filming Women Doctors And Students In Private Hospital In Guntur, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

గుంటూరు: డాక్టర్ల నగ్న వీడియోల చిత్రీకరణ

Nov 26 2025 7:58 AM | Updated on Nov 26 2025 11:35 AM

Filming of Private videos of doctors in Private hospital at Prathipadu AP

కాటూరి మెడికల్‌ కళాశాల, ఆస్పత్రిలో ఘటన 

మొబైల్‌తో గోడపై నుంచి న్యూడ్‌ వీడియోలను తీసిన మేల్‌ నర్స్‌  

పోలీసులకు ఫిర్యాదు చేసిన కళాశాల యాజమాన్యం 

మొబైల్‌ సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిన పోలీసులు

ప్రత్తిపాడు: ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యులు దుస్తులు మార్చుకునే సమయంలో నగ్న వీడియోలు తీస్తున్న మేల్‌ నర్స్‌ను ప్రత్తిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు సౌత్‌ జోన్‌ డీఎస్పీ జి.భానూదయ కథనం మేరకు.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఈదులపాలెంలోని కాటూరి మెడికల్‌ కళాశాల, ఆస్పత్రిలో సుమారు నెల రోజుల కిందట చిలకలూరిపేట సమీపంలోని పురుషోత్తమపట్నంకు చెందిన రాచపూడి వెంకటసాయి మేల్‌ నర్సుగా విధుల్లో చేరాడు. 

ఆస్పత్రిలోని ఆపరేషన్‌ థియేటర్‌ సమీపంలోని డ్రెస్సింగ్‌ రూమ్‌లో మహిళా డాక్టర్లు, వైద్య విద్య చదువుతున్న పీజీ విద్యార్థులు దుస్తులు మార్చుకునే సమయంలో వెంకటసాయి తన మొబైల్‌ ద్వారా గోడపై నుంచి నగ్న వీడియోలు తీస్తున్నాడు. వైద్యులు, విద్యార్థులు విషయాన్ని గమనించి ఫోన్‌ లాక్కుని అందులో ఉన్న వీడియోలను డిలీట్‌ చేశారు. 

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకటసాయిని అదుపులోనికి తీసుకుని, అతని మొబైల్‌ను సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. అందులో ఉన్న డిలీటెడ్‌ డేటా రికవరీ చేసిన వెంటనే ఛార్జిïÙటు ఫైల్‌ చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యం ఇచి్చన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేశామని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement