
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు ఇంట్లో మరోసారి విషాదం చోటుచేసుకుంది. మాగంటి రెండో కుమారుడు రవీంద్రనాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. తాగుడు అలవాటునుమానేందుకు రవీంద్రనాథ్ ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. మద్యానికి బానిస అయిన రవీంద్రను ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కుటుంబసభ్యులు చేర్పించారు. ఆసుపత్రి నుంచి తప్పించుకుని హోటల్‌లో ఉన్నాడు. బ్లడ్ వామిటింగ్తో హయత్ ప్యాలెస్లో రవీంద్రనాథ్ చనిపోయారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి పోలీసులు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
చదవండి: టీడీపీ మాజీ ఎంపీ మాగంటి తనయుడు కన్నుమూత