శ్రీశైలంలో దసరా మహోత్సవాలు | Dussehra celebrations in Srisailam Temple Andhra Pradesh | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో దసరా మహోత్సవాలు

Sep 26 2022 5:59 AM | Updated on Sep 26 2022 5:59 AM

Dussehra celebrations in Srisailam Temple Andhra Pradesh - Sakshi

శ్రీశైల ఆలయం

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు సోమవారం ఉదయం యాగశాల ప్రవేశంతో ప్రారంభం కానున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాల్లో అమ్మవారికి నవదుర్గ అలంకారాలు, ప్రత్యేక నవావరణపూజలు, స్వామి అమ్మవార్లకు వాహనసేవలు, చండీయాగం, రుద్రయాగం నిర్వహించనున్నారు.

దసరా మహోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీశైల భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజల అనంతరం అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement