
విజయవాడ: చంద్రగ్రహణం కారణంగా రేపు(ఆదివారం, సెప్టెంబర్ 7వ తేదీ) విజయవాడ దుర్గమ్మవారి గుడిని మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం గం. 3.30ని.లకు దుర్గగుడితో పాటు ఉపాలయాలు కవాట బంధనం(తలుపులు మూసివేయబడును) ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది.
గ్రహణ మోక్షకాల అనంతరం అంటే 8వ తేదీ లెల్లవారు జామున 3 గంటలకు కవాట ఉద్ఘటన( తిరిగి తలుపులు తీయడం) ఉంటుంది. స్నపనాభిషేకాల అనంతరం ఉదయం గం. 8.30ని.ల నుంచి తిరిగి భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయి.