ఆధారాల్లేక వెనక్కు తగ్గిన పోలీసులు | Dramatic developments in Mohit Reddys arrest | Sakshi
Sakshi News home page

ఆధారాల్లేక వెనక్కు తగ్గిన పోలీసులు

Jul 29 2024 5:11 AM | Updated on Jul 29 2024 5:11 AM

Dramatic developments in Mohit Reddys arrest

మోహిత్‌రెడ్డి అరెస్ట్‌లో నాటకీయ పరిణామాలు  

న్యాయమూర్తి ఎదుట హాజరు పరచకుండానే స్టేషన్‌ బెయిల్‌ 

41(సీ) నోటీసు ఇచ్చేందుకు లుక్‌ అవుట్‌ నోటీసులు ఇస్తారా?

తిరుపతి రూరల్‌: వైఎస్సార్‌సీపీ చంద్రగిరి ఇన్‌చార్జ్, తుడా మాజీ చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక్క ఆధారం కూడా లేకపోవడంతో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచకుండానే స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించేశారు. శనివారం రాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆరి్థక ఉగ్రవాది, టెర్రరిస్ట్‌ అన్న తరహాలో మోహిత్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఆదివారం ఉదయం తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. 

ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మోహిత్‌రెడ్డిని న్యాయమూర్తి ముందు హాజరు పరిచేందుకు పోలీసులు వెనకడుగు వేశారు. మోహిత్‌రెడ్డిపై మోపిన అభియోగాల్లో ఆధారాలు లేకపోవడం, ఘటన జరిగిన సమయంలో జిల్లా మెజి్రస్టేట్‌ హోదాలో ఉన్న కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, ఎన్నికల అధికారుల సమక్షంలోనే సీసీ కెమెరాల సాక్షిగా మోహిత్‌రెడ్డి ఉండడం, ఆ సమయంలో కనీసం ఫోన్‌ సౌకర్యం కూడా లేకపోవడం.. 

తదితర కారణాల వల్ల పోలీసులు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. దీంతో ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు కావాలని 41(సీ) నోటీసులు ఇచ్చి పంపించేశారు. ప్రజల మధ్యే ఉంటూ, సొంతూరులో పోలీసుల కళ్లెదుటే కనిపిస్తున్నా పట్టించుకోని పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిడితో తనకు సంబంధంలేని ఘటనలో 52 రోజుల తర్వాత ఏ–37గా కేసు పెట్టారు.

వంద కేసులు పెట్టినా భయపడం 
విదేశాల్లో చదువుకుని ప్రజాసేవకు వచి్చన నాపై ఇది మొదటి కేసు. ఇలాంటి అక్రమ కేసులు వంద పెట్టినా, బుల్లెట్లతో కాలి్చనా వెనక్కి తగ్గేది లేదు. ఈ కేసులో నా ప్రమేయం నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. మా నాన్న నాకు ప్రజలకు సేవ చేయడం, ప్రజల పక్షాన పోరాడటమే నేరి్పంచారు. మమ్మల్ని రాజకీయంగా సమాధి చేస్తానని పులివర్తి నాని కలలు కంటున్నారు. అది ఆయన తరం కాదు. – చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి 

దమ్ముంటే జడ్జి ముందుహాజరు పరచాలి 
ఎఫ్‌ఐఆర్‌ నమోదు సమయంలో పేరు కూడా లేని వ్యక్తిని 52 రోజుల తర్వాత ఏ–37గా ఇరికించడం అప్రజాస్వామికం. «ఇది తప్పుడు కేసు అని ప్రభుత్వానికి, పోలీసులకు కూడా తెలుసు. ఎవరిని తృప్తి పరిచేందుకు లుక్‌ అవుట్‌ నోటీసులు ఇచ్చారు.. అరెస్ట్‌ చేశారు? పోలీసులకు దమ్ము, ధైర్యం ఉంటే అరెస్ట్‌ చేసిన మోహిత్‌రెడ్డిని న్యాయమూర్తి ముందు హాజరు పరచాలి.   – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement