నిలకడగా నాగేంద్రబాబు ఆరోగ్యం

Divya Case: Accused Nagendra Babu Health Is In Stable - Sakshi

సాక్షి, గుంటూరు: దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు తెలిపారు. విజయవాడలో బీటెక్‌ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబు అనంతరం ఆత్మహత్యకు యత్నించి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విషయం విదితమే. కడుపులో పేగులకు అయిన గాయాలకు ఆపరేషన్‌ చేసిన అనంతరం వైద్యులు నాగేంద్ర బాబును పోస్టు ఆపరేటివ్‌ ఐసీయూ వార్డుకు మార్చారు. (అమ్మాయిలు ధైర్యంగా ఉండండి: సుచరిత)

వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్‌ఎంఓ సతీష్‌ ఆదివారం తెలిపారు. నాగేంద్రబాబు గాయపడి 48 గంటలు దాటిందని, కొంతమేరకు కోలుకున్నాడని వెల్లడించారు. సోమవారం అతని ఆరోగ్య పరిస్థితిని వైద్య అధికారులు పరీక్షించిన అనంతరం తదుపరి వివరాలు తెలియజేస్తామన్నారు.  ('7 నెలలుగా దివ్య ఎంత క్షోభ అనుభవించిందో')

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top