ఏపీ: కొనసాగుతున్న ‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ పంపిణీ | Distribution Of YSR Pension Kanuka In AP | Sakshi
Sakshi News home page

ఏపీ: కొనసాగుతున్న ‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ పంపిణీ

Sep 1 2021 7:40 AM | Updated on Sep 1 2021 9:33 AM

Distribution Of YSR Pension Kanuka In AP - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో ‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ పంపిణీ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తెల్లవారు జామునుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ పంపిణీ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తెల్లవారు జామునుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. 59.18 లక్షల మంది పెన్షనర్లకు రూ.1,382.63 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టారు. వృద్ధులు, వికలాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీఆర్‌డీఏ కాల్‌ సెంటర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. లబ్ధిదారులకు బయోమోట్రిక్‌, ఐరిస్‌ విధానం ద్వారా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది.

ఇవీ చదవండి:
Andhra Pradesh: కళ్లెదుటే కలల గృహం 
మరో రెండు రోజులు వర్షాలు

Advertisement
 
Advertisement
Advertisement