డిజిటిల్ అసిస్టెంట్‌ సస్పెస్షన్‌ | Digital Assistant Suspended In Anantapur District | Sakshi
Sakshi News home page

డిజిటిల్ అసిస్టెంట్‌ సస్పెస్షన్‌

Aug 13 2021 8:57 AM | Updated on Aug 13 2021 8:57 AM

Digital Assistant Suspended In Anantapur District - Sakshi

అనంతపురం: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తలుపుల మండలం పులిగుండ్లపల్లి గ్రామ సచివాలయ డిజిటిల్ అసిస్టెంట్‌ నరేష్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు మండల ఎంపీడీఓ విష్ణుప్రసాద్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో పాటు అర్హులైన నలుగురికి నేతన్న నేస్తం అందకపోవడంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ అలసత్వమే కారణమని గుర్తించామన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించడంతో సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement