breaking news
employee suspended
-
సచివాలయాల సిబ్బంది చేతివాటం
ప్రొద్దుటూరు క్రైం/మాచర్ల/రాప్తాడు/కుక్కునూరు/చీపురుపల్లి/పాలకొల్లు అర్బన్: పింఛన్ల పంపిణీలో తొలి రోజే సచివాలయాల సిబ్బంది చేతివాటం చూపారు. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు 7వ వార్డు సచివాలయంలో మురళీమోహన్ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. సోమవారం పింఛన్ పంపిణీ చేసేందుకు అధికారులు అతడికి రూ.4 లక్షలు ఇచ్చారు. ఈ క్రమంలో అతడికి రోడ్డు ప్రమాదం జరిగి కింద పడిపోగా 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు తమదైన స్టైల్లో మురళీమోహన్ను విచారించగా ఆ డబ్బును అతడే వాడుకున్నట్లు తేలింది. దీంతో అతడిని సస్పెండ్ చేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని లంకలకోడేరు సచివాలయ కార్యదర్శి–2 బి.రాము పింఛన్ల డబ్బు రూ.2,50,500 తీసుకుని పరారయ్యాడు. అతడి ఫోన్ స్విచాఫ్ చేసి ఉండటంతో పంచాయతీ కార్యదర్శి రాజేష్ సోమవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాం కర్లాం సచివాలయంలో వ్యవసాయ సహాయకునిగా పని చేస్తున్న రాఘవకు పింఛన్ల పంపిణీ చేయమని అధికారులు రూ.3.96 లక్షలు అందజేశారు.అయితే రాఘవ ఆ డబ్బుతో మాయమయ్యాడు. అలాగే ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దామరచర్లలో పింఛన్లు పంపిణీ చేసే బాధ్యతలను ఉప్పేరు పంచాయతీలో వెటర్నరీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సంకు ప్రసాద్‌కు అధికారులు అప్పగించారు. అతడు పింఛన్లు పంపిణీకి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ తర్వాత ఉద్యోగి స్వగ్రామమైన చింతలపూడి మండలం సీతానగరానికి వెళ్లిన అధికారులకు అతడు గాయాలతో ఇంటి వద్దే కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల తొమ్మిదో వార్డుకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ ముడావత్ వాల్యూనాయక్ ఒక్కో లబ్ధిదారుకు రూ.7 వేలు చొప్పున అందించాల్సి ఉండగా.. ఒక్కొక్క లబి్ధదారు నుంచి రూ.500 చొప్పున వసూలు చేశాడు. దీనిపై మున్సిపల్ కమిషనర్ వెంకటదాసుకు ఫిర్యాదులు రావడంతో ఆయన వాల్యూ నాయక్‌ను సస్పెండ్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గాండ్లపర్తిలో పింఛన్ల లబి్ధదారులకు రూ.7 వేలు చొప్పున పంపిణీ చేయాల్సి ఉండగా.. గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీనివాసులు దాదాపు 20 మందికి రూ.6 వేలే ఇచ్చాడు. -
డిజిటిల్ అసిస్టెంట్ సస్పెస్షన్
అనంతపురం: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తలుపుల మండలం పులిగుండ్లపల్లి గ్రామ సచివాలయ డిజిటిల్ అసిస్టెంట్ నరేష్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు మండల ఎంపీడీఓ విష్ణుప్రసాద్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో పాటు అర్హులైన నలుగురికి నేతన్న నేస్తం అందకపోవడంలో డిజిటల్ అసిస్టెంట్ అలసత్వమే కారణమని గుర్తించామన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించడంతో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. -
మందుల నిర్వహణలో అవకతవకలు
సంబంధిత ఉద్యోగి సస్పెండ్ సాక్షి, హైదరాబాద్: ఎయిడ్స్ రోగులకు మందులను నిల్వ చేసే నగరానికి చెందిన ఓ స్టోర్ నిర్వహణలో లోపాలున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ అధికారులు గుర్తించారు. ఈ మందులను నిల్వ చేసే స్టోర్‌లో కొన్ని అవకతవకలు జరిగినట్లు ఈ అధికారుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఇటీవల స్టోర్‌ను పరిశీలించారు. ఈ పరిశీలనలో పలు అవకతవకలు జరిగినట్లు తేలడంతో స్టోర్ ఇన్చార్జిని సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో ఎరుుడ్‌స వ్యాధిగ్రస్తులకు సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం మందులను రాష్ట్రానికి ఇస్తుంది. ఈ మందుల నిల్వ కోసం ఎల్బీ నగర్లో ప్రత్యేక స్టోర్‌ను నిర్వహిస్తున్నారు. అరుుతే ఈ స్టోర్ నిర్వహణ బాధ్యతలను ఒక కాంట్రాక్టు ఉద్యోగి చూస్తున్నారు. ప్రభుత్వం అందించిన మందులకు... ఈ స్టోర్ నుంచి సరఫరా చేసిన మందులకు తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ స్టోర్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు సరిగా లేనట్లు పరిశీలనలో తేలడంతో స్టోర్ ఇన్చార్జిని సస్పెండ్ చేశారు. కాగా ఈ స్టోర్‌లో మందులు గోల్మాల్ అయ్యాయా? ఇంకేమైనా అవకతవకలు ఉన్నాయా? అనే విషయంపై అధికారులు పూర్తిస్థారుు విచారణ చేయాలని నిర్ణరుుంచారు. విచారణ తర్వాత అవకతవకలు జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.