అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో దౌర్జన్యం

Dharmana Krishna Das Slams On Atchannaidu In Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో దౌర్జనానికి పాల్పడ్డారని, కింజరాపు అప్పన్నను భయబ్రాంతులకు గురిచేశారని డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు చెప్పిన మాటలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషనర్ అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోమని ఆదేశించారని, అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని అన్నారు.

ఎన్నికలకు వైస్సార్‌సీపీ ఎప్పుడూ భయపడదని, ప్రజలు పెద్ద ఎత్తున వైస్సార్‌సీపీ మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజరంజక పాలన జరుగుతుందని పేర్కొన్నారు. దౌర్జన్యలు అక్రమాలకు టీడీపీ నేతలు పాల్పడి వైస్సార్‌సీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను భయపెట్టే విధంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారని, పోలీసులను మీ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top