
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 58,358 మంది స్వామిని దర్శించుకున్నారు. 27,024 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.45 కోట్లు సమర్పించారు.
టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 26వ తేదీన అంకురార్పణ, మార్చి 27వ తేదిన మేషలగ్నంలో ఉదయం 9.15 గంటల నుండి 9.30 గం.ల వరకు ధ్వజారోహణం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 03వ తేదీన ఉదయం 9.15 గం.లకు రథోత్సవం, ఏప్రిల్ 07వ తేదీన రాత్రి 07 గం.ల నుండి 9.30 గం.ల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుందని, భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వేసవి నేపథ్యంలో భక్తులు నడిచేందుకు వీలుగా వైట్ పెయింట్, చలువ పందిళ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, డిప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, ఏఈవో శ్రీ రవి, ఆలయ ఇస్పెక్టర్ శ్రీ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.