పెట్రోల్‌ బంక్‌లోకి చొరబడి పిడిగుద్దుల వర్షం.. సీసీటీవీలో దృశ్యాలు | Crooks Hulchal In Guntur, Attacked On Man Who Working In Petrol Bunk | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంక్‌లోకి చొరబడి పిడిగుద్దుల వర్షం.. సీసీటీవీలో దృశ్యాలు

Jun 19 2021 4:12 PM | Updated on Jun 19 2021 8:42 PM

Crooks Hulchal In Guntur, Attacked On Man Who Working In Petrol Bunk - Sakshi

సాక్షి, గుంటూరు: గుంటూరులో కొందరు ఆకతాయిలు హల్‌చల్‌ చేశారు. మద్యం మత్తులో పెట్రోల్ బంక్‌లోకి చొరబడి హంగామా చేశారు. వివాదం ఏంటో తెలియదు గానీ బంక్‌లో పనిచేస్తున్న ఓ యువకుడిపై  విచక్షణారహితంగా దాడి చేశారు. తోటి సిబ్బంది ఆ యువకులకు ఎంత నచ్చ జెప్పినా వినకుండా మళ్లీ మళ్లీ బాధితుడిపై దాడికి పాల్పడ్డారు. దాడి దృశ్యాలు బంక్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఘటనపై బంక్‌ యాజమాని పోలీసులకు సమాచారమివ్వగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీల దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిసింది. మరోవైపు ఘటనపై రాజీకి రమ్మంటూ బంక్ యజమానిపై కొందరు రాజకీయ నేతలు ఒత్తిడి తెస్టున్నట్టు సమాచారం. 
చదవండి: యల్లనూరులో భగ్గుమన్న పాత కక్షలు

Advertisement
 
Advertisement
Advertisement