రాష్ట్రం బాగు కోరుకునే వారు బీజేపీని వ్యతిరేకించాలి

CPM Politburo Member BV Raghavulu Fires On BJP, Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ : పెట్టుబడిదారి విధానాన్ని అమలు చేసే దేశాలు కరోనా కట్టడి చేయడంలో విఫలమయ్యాయని సీపీఎం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. సోషలిస్టు దేశాలు కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాయన్నారు. ఇందుకు క్యూబా దేశాలే ఉదాహరణ అని పేర్కొన్నారు. నవంబర్‌ 7 నుంచి 15 వరకు రాష్ట వ్యాప్తంగా సీపీఎం పార్టీ రాజకీయ క్యాంపెయిన్‌ నిర్వహించనుంది. ఈ మేరకు శనివారం విజయవాడలో ప్రచార ప్రారంభ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు, వి ఉమామహేశ్వరరావు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. అనంతరం క్యాంపెయిన్‌ను బీవీ రాఘవులు జెండా ఊపి ప్రారంభించారు. చదవండి: ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి: సీపీఎం

బీవీ రాఘవులు మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. భారతదేశం 104 నుంచి సూచి 90కి పడిపోయిందని తెలిపారు. ప్రభుత్వాలు ప్రజలకొనుగోలు శక్తి పెంచాలని సూచించారు. అంబానీ, ఆదాని ఆస్తులు పెరుగుతున్నాయని, ప్రభుత్వ రాయితీలు వారు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. బీజేపీ కరోనా కట్టడిలోవిఫలమైందని, ఆర్థిక వ్యవస్థను కుంటు పడేలా చేసిందని మండిపడ్డారు. దేశంలో ఆకలి ఆచావులు పెరిగి పోయాయన్నారు. మత కలహాలు పెరిగి, మహిళలకు రక్షణ కరువైందన్నారు. బీజేపీ కార్మికుల చట్టాలను కాల రాసిందని, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా కొత్త చట్టాలు తెచ్చారని విమర్శించారు. బీజేపీ దేశం మొత్తన్ని అమ్మేస్తుందని, కంపెనీలు, రైళ్లను ప్రవేటు పరం చేస్తున్నారని దుయ్యబట్టారు. చదవండి: మతోన్మాదాన్ని బీజేపీ రెచ్చగొడుతుంది..

కార్మికుల, మహిళల, రైతుల,దళితుల, మైనార్టీల హక్కులను బీజేపీ కాలరాసింది. విద్యా వ్యవస్థ నాశనం చెసేలా నూతన విద్యా విధానంలో తెచ్చింది. రాజధాని, పోలవరం డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తుంది. రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్ట్, వెనుకబడి జిల్లాలకు బుందేల్ కండ్ తరహా ప్యాకేజీ అంశాలలో బీజేపీ చేతులు దులుపుకుంటుంది. బీజేపీ మత కలహాలు సృష్టిస్తోంది. ట్రంప్‌ను అమెరికాలో ప్రజలు మట్టి కరిపించారు. ట్రంప్‌ను మోడీ భుజాన వేసుకుని ప్రచారం చేశారు. రాష్ట్రం బాగు కోరుకునే వారు బీజేపీని వ్యతిరేకించాలి. రాజధానికి 55 వేల ఎకరాలు అవసరం లేదని నాడే చెప్పాం. రాజధానికి 15 వేల ఎకరాలు చాలు. రాజధాని పేరుతో రియలేస్టేట్ వ్యాపారం చేశారు. చంద్రబాబు... చెప్పినా వినలేదు. రైతులు రోడ్డున పడటానికి చంద్రబాబే కారణం. రాజధాని పూర్తి కాకపోవడానికి కారణంగా చంద్రబాబే. రాష్ట్ర అభివృద్ధి పై  ప్రభుత్వం దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top