ఏపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాలి

CP Srinivasulu Said Must Have An E Pass In Enter The AP - Sakshi

సీపీ శ్రీనివాసులు

సాక్షి, విజయవాడ: కోవిడ్ సమస్యలన్నీ ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నామని సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఏపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాలని సీపీ స్పష్టం చేశారు. వచ్చే అంబులెన్స్‌లను పరిశీలించి అనుమతి ఇస్తున్నామన్నారు. మద్యం అక్రమ తరలింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

‘‘కోవిడ్ సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సమస్యలు ఉన్నాయి. జీజీహెచ్‌లో అక్సిజన్‌ అయిపోయే ప్రమాదాన్ని అందరి సహకారంతో అరికట్టాం. పోలీసు శాఖలో 97 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైంది. బ్లాక్‌మార్కెట్‌లో ఇంజక్షన్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. బ్లాక్‌మార్కెట్‌లో ఇంజక్షన్లను అమ్మే 12 గ్యాంగ్‌లను పట్టుకున్నాం. విజయవాడ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుపై కేసులు నమోదు చేశాం. కరోనా కట్టడికి పెద్ద ఎత్తున ర్యాలీలు, అవగాహన కల్పించామని’’ సీపీ శ్రీనివాసులు పేర్కొన్నారు.

చదవండి: తండ్రి పేరుతో సుక్కు ఆక్సిజన్‌ ప్లాంట్‌, ప్రారంభించిన మంత్రి
‘మితిమీరిన స్టెరాయిడ్స్ వాడకమే బ్లాక్ ఫంగస్‌కు కారణం’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top