
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల జోరు కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 62,123 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ శనివారం బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 24,24,393కి చేరింది. కొత్తగా 10,080 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కరోనా కేసులు 2,17,040కి చేరాయి. (చదవండి : కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి)
గడిచిన 24 గంటల్లో 97మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 1,939కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకొని గత 24 గంటల్లో 9,151 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 85,486 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.