Corona Virus: ఏపీలో కొత్తగా 1,515 కేసులు | Corona Virus: New 1515 Cases Reported In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Corona Virus: ఏపీలో కొత్తగా 1,515 కేసులు

Aug 27 2021 5:27 PM | Updated on Aug 27 2021 9:26 PM

Corona Virus: New 1515 Cases Reported In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 68,865 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,515 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,09,245 కు చేరింది. గురువారం కరోనా బారిన పడి 10  మంది మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 13,788 కు చేరింది. 

నిన్న ఒక్క రోజే 903 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19,80,407 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 15,050 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,64,06,811 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement