విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ 2025–26 మూడో విడత సీట్ల కేటాయింపులో తీవ్ర గందరగోళం నెలకొందని, సీట్ల కేటాయింపులో నిబంధనలను పాటించడం లేదంటూ ‘ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ’ రాష్ట్ర అధ్యక్షుడు శిఖరం నరహరి, కార్యదర్శి ఈశ్వరయ్య ఆదివారంఒక ప్రకటనలో మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని తక్షణమే సమీక్షించాలని హెల్త్ వర్సిటీని డిమాండ్ చేశారు.
‘స్ట్రే’ వెకెన్సీ రౌండ్ సీట్ల కేటాయింపు
ఎంబీబీఎస్ కనీ్వనర్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఆదివారం ఆరోగ్య విశ్వవిద్యాలయం సీట్లు కేటాయించింది. విద్యార్థులు సోమవారం ఉ.11 గంటల నుంచి అలాట్‌మెంట్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. అలాగే, మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల్లోపు కళాశాలల్లో రిపోర్ట్ చేయడానికి గడువు విధించింది. తుది దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన ఎనిమిది మంది ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయలేదు. దీంతో ఆ సీట్లను ఈ స్ట్రే వెకెన్సీ రౌండ్‌లో భర్తీచేశారు.


