కరెన్సీ కాదు.. కలర్‌ జిరాక్స్‌! | Color xerox currency notes In sri sathyasai | Sakshi
Sakshi News home page

కరెన్సీ కాదు.. కలర్‌ జిరాక్స్‌!

Nov 7 2024 1:57 PM | Updated on Nov 7 2024 1:57 PM

Color xerox currency notes In sri sathyasai

బత్తలపల్లి: టెక్నాలజీ మహిమ..అంతా మాయ. కాస్త ఏమరుపాటుగా ఉంటే ఇట్టే మోసం చేస్తున్నారు.  తెలివిమీరిపోయిన కొందరు కేటుగాళ్లు... బత్తలపల్లిలోని చిరు వ్యాపారులకు టోకరా వేశారు. రూ.10 విలువైన వస్తువులు కొని రూ.200, రూ.500 నోట్లు ఇచ్చి మిగిలిన చిల్లర తీసుకుని మరీ వెళ్లారు. 

ఆ నోట్లు తీసుకుని బ్యాంకులకు వెళ్లిన చిరువ్యాపారులు అవి కలర్‌ జిరాక్సు పేపర్లు అని తెలిసి లబోదిబోమంటున్నారు. మోసాలు ఇటీవల బత్తలపల్లిలోనే ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. కూడలిలో ఆటోవాలాకు ఓ వ్యక్తి ఇలాగే కలర్‌ జిరాక్స్‌ నోటు ఇచ్చాడు. 

అలాగే జొన్నరొట్టెలు విక్రయించే వృద్ధురాలినీ ఓ ఆగంతకుడు ఇలాగే మోసం చేశాడు. కలర్‌ జిరాక్స్‌ నోట్ల బాధితుల్లో ఎక్కువగా చిరువ్యాపారులే ఉండటం గమనార్హం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement