CM YS Jagan To Visit Nellore District On 27th October - Sakshi
Sakshi News home page

27న నెల్లూరు జిల్లాకు సీఎం జగన్‌

Oct 26 2022 3:30 AM | Updated on Oct 26 2022 9:29 AM

CM YS Jagan To Visit Nellore District On 27th October - Sakshi

సాక్షి, అమరావతి/నెల్లూరు(అర్బన్‌): సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 27న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటు చేసిన ఏపీ జెన్‌కో ప్రాజెక్టు మూడో యూనిట్‌(800 మెగావాట్లు)ను సీఎం జగన్‌ జాతికి అంకితం చేయనున్నారు.

గురువారం ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి.. 10.55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 11.10 గంటల నుంచి మధ్యాహ్నం 1.10 మధ్యలో నేలటూరులోని ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేసి.. అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.35 గంటలకు నేలటూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.   

Advertisement
 
Advertisement
Advertisement