సీఎం జగన్‌ తిరుమల పర్యటన ఖరారు

CM YS Jagan Tirumala Tour Schedule - Sakshi

సాక్షి, తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 23న విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 3.50 గంటలకు సీఎం జగన్‌ చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటలకు తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్‌కు వెళతారు. సాయంత్రం 6.20 గంటలకు గరుడ వాహనం సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 24న ఉదయం 8.10 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల నూతన భవన నిర్మాణ భూమి పూజలో వైఎస్‌ జగన్ పాల్గొంటారు. అదే రోజు ఉదయం 11.30 గంటలకు తిరుమల నుండి తిరుగు ప్రయాణం అవుతారు. (చదవండి: సింహ వాహనంపై బ్రహ్మాండ నాయకుడు)

(చదవండి: దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్‌ సరికొత్త యాప్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top