సీఎం జగన్‌ పేదవాడి గుండె చప్పుడు 

CM YS Jagan Is Poor People Heart Beat Says Minister Avanthi Srinivas - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదవాడి గుండె చప్పుడని, ప్రజల గుండెల్లో దేవుడై ఉన్నాడని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. సీఎం జగన్‌.. చంద్రబాబు లాగా పూటకోసారి మీడియా ముందుకు రారని, జూమ్‌లో మీటింగ్‌లు పెట్టే వ్యక్తి కాదని పేర్కొన్నారు. బుధవారం విశాఖ పీఎం పాలెం గాయత్రి నగర్లో సుమారు 2 కోట్ల రూపాయలతో పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రి అవంతి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ముఖ్యమంత్రి సచివాలయ సిబ్బందికి  ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించారు. వాలంటరీ వ్యవస్థని దేశ ప్రధాని పొగిడారు. పని చేసేవాడినే ప్రజలు ఎన్నుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో రూ. 1500 కోట్లు ఖర్చు పెట్టింది. అధికారంలోకి వచ్చాక జూట్ మిల్లు, తగరపువలస ఆర్టీసీ సమస్యలను తీర్చాం. (దేవాలయాలు కూల్చిన చరిత్ర టీడీపీ, బీజేపీలది..)

అగ్రిగోల్డ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ. 1000 కోట్లు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మధురవాడలో ఒక్క గజం కూడా కబ్జా కాలేదు. మధురవాడలో రూ. 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఒక్కో వార్డులో 13 నుంచి 14 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. చంద్రబాబుకు వేరే దిక్కు తోచక అల్లర్లు చేస్తున్నారు. ఏదో ఒక రభస చేసి ముఖ్యమంత్రికి మంచి పేరు రాకుండా చేస్తున్నారు. అభివృద్ధి విషయంలో సీఎం జగన్‌ కష్టపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవ్వరూ ఎవ్వరినీ చంపరు. రోజు రోజుకీ చంద్రబాబు దిగజారుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మధురవాడని మధురమైన వాడగా తీర్చిదిద్దుతాం’’ అని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top