ఆ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయండి: సీఎం జగన్‌ | CM YS Jagan Mohan Reddy Review Meeting On Pending Projects | Sakshi
Sakshi News home page

ఆ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయండి: సీఎం జగన్‌

Feb 8 2021 4:28 PM | Updated on Feb 8 2021 5:08 PM

CM YS Jagan Mohan Reddy Review Meeting On Pending Projects - Sakshi

విశాఖ : అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఆదేశించారు. విశాఖ, ఏఎంఆర్‌డీఏ పరిధిలోని ప్రాజెక్ట్‌లపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరకట్ట రోడ్డును 4 లైన్లుగా విస్తరించే ప్రతిపాదనపై సీఎం జగన్‌కు అధికారులు వివరాలు అందించారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారుతుందని,  దానికి ఆనుకొని ఉన్న రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ఈ నిర్మాణం కోసం దాదాపు రూ.150 కోట్లు అవుతుందని అంచనా. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. (వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటాం..)

విశాఖ సముద్రతీరంలో13.59 ఎకరాల్లో ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలపై చర్చించారు. గతంలో ఇదే భూమిని లూలూ గ్రూప్‌కు కారుచౌకగా 33 ఏళ్ల లీజ్‌కు గతప్రభుత్వం కట్టబెట్ట్టెంది. ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేలా, విశాఖకు తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రతిపాదనలపై సీఎం సమీక్షించారు. ఎన్‌బీసీసీ, ఏపీఐఐసీ కమర్షియల్‌ ప్లాజా, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాల వల్ల  కనీసం ప్రభుత్వానికి రూ.1450 కోట్ల నికర ఆదాయం వస్తుందని ఎన్‌బీసీసీ తెలిపింది.(టీడీపీ ఎంపీ కనకమేడలపై చర్యలు తీసుకోండి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement