AP: పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా.. అక్టోబర్‌ 1 నుంచి వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా

CM Jagan Nod For YSR Kalyanamasthu And YSR Shaadi Tohfa - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98.44 శాతం అమలు చేసి.. సంక్షేమ అమలులో తన చిత్తశుద్ధి చూపించుకుంది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం. తాజాగా ఏపీలో మరో భారీ సంక్షేమ పథకానికి కసరత్తులు పూర్తి చేసింది. మరో కీలక హామీని నెరవేరుస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు  అమలు చేయనుంది.

బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మిక కుటుంబాలకు ఈ పథకం వర్తించనున్నాయి. పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని జగన్‌ సర్కార్‌ అమలు చేయనుంది. అంతేకాదు.. ఈ పథకం కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు సాయం అందించనుంది. 

  • ఎస్సీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు
  • ఎస్సీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు
  • ఎస్టీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు
  • ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు
  • బీసీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద రూ.50వేలు
  • బీసీల కులాంతర వివాహాలకు రూ.75వేలు
  • మైనారిటీలకు షాదీ తోఫా కింద లక్ష రూపాయలు.
  • దివ్యాంగులు వివాహాలకు రూ. 1.5 లక్షలు
  • భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40వేలు ఆర్థిక సాయం అందించనుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

బాబు హయాంలో.. ఆర్భాటం జాస్తి... అమలు నాస్తి
దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోకు విశ్వసనీయత అద్దిన సీఎం వైఎస్‌ జగన్‌.. రాజకీయాల్లో అంకిత భావానికి, నిబద్ధతకు ప్రతిరూపంగా నిలిచారు. గత ప్రభుత్వంలో కాగితాలకే పరిమితమైన సంక్షేమాన్ని.. ఇప్పుడు ఆచరణలో చూపిస్తున్నారు సీఎం జగన్‌. గత ప్రభుత్వంలోనూ ఇలాంటి పథకం ఉన్నా.. అది కేవలం కాగితాలకే పరిమితం అయ్యింది. పైగా అన్నివర్గాల లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున పెళ్లి కానుక లభించలేదు. 

2017లో బీసీలను పథకంలో చేర్చిన నాటి చంద్రబాబు ప్రభుత్వం.. పెళ్లికానుక అందించలేదు. 
 ► నాటి మార్గదర్శకాల్లోనూ సమగ్రత లేదు
► లబ్ధిదారులకు ఇవ్వాలన్న కోణంలో కాకుండా, ఎలా ఎగ్గొట్టాలన్న కోణంలో నియమాలు, నిబంధనలు

కానీ.. అర్హులందరికీ వర్తించేలా పథకాన్ని తీర్చిదిద్దిన వైయస్‌.జగన్‌ సర్కార్‌. గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు. ఒక్కసారి పోల్చి చూస్తే..

ఎస్సీలకు వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు కింద రూ. 1లక్ష రూపాయలు.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 40వేలు
► ఎస్సీల కులాంత వివాహాలకు జగన్‌ సర్కార్‌ సాయం రూ. 1.2 లక్షలు.. చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది రూ.75వేలు 
► ఎస్టీలకు వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు కింద రూ. 1 లక్ష..  గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.50వేలు
► ఎస్టీల కులాంతర వివాహాలకు జగన్‌ సర్కార్‌ సాయం రూ.1.2 లక్షలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 75వేలు
► బీసీలకు వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు కింద  రూ. 50వేలు.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.35వేలు
► బీసీల కులాంతర వివాహాలకు జగన్‌ సర్కార్‌ సాయం రూ.75వేలు.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 50వేలు
► మైనార్టీలకు వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా కింద రూ. 1 లక్ష.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.50వేలు
► దివ్యాంగుల వివాహాలకు జగన్‌ ప్రభుత్వ సాయం  రూ. 1.5 లక్షలు.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 1లక్ష మాత్రమే. 
అలాగే.. భవన నిర్మాణ కార్మికులకు జగన్‌ ప్రభుత్వం రూ.40వేలు ప్రకటిస్తే.. గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.20వేలే ప్రకటించింది.

అన్ని అర్హతలను జీవోలో పొందుపరిచిన ఏపీ ప్రభుత్వం.. పథకానికి సంబంధించి పూర్తిగా వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి తేనుంది. అంతేకాదు.. వాటి ద్వారా పథకం నిర్వహణ చేపట్టనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top