వారి సంకల్పం, ధైర్యం మనందరికీ స్ఫూర్తి: సీఎం జగన్‌

Cm Jagan Happy For Rescuing Workers Trapped Tunnel In Uttarkashi - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఉత్తరకాశీలో టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించటం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘టన్నెల్ ఆపరేషన్‌లో రెస్క్యూ టీం  అవిశ్రాంతంగా పనిచేసింది. అలుపెరగని ప్రయత్నాల చేసి కార్మికులను రక్షించిన రెస్క్యూ టీం కి నా అభినందనలు. వారి సంకల్పం, ధైర్యం మనందరికీ స్ఫూర్తి. మొత్తం 41 మంది కార్మికులు సొరంగం నుండి సురక్షితంగా బయటపడటం సంతోషాన్నిచ్చింది’’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

ప్రమాదవశాత్తూ సొరంగంలో చిక్కుకొని ఆశ నిరాశల మధ్య క్షణమొక యుగంలా బిక్కుబిక్కుమంటూ గడిపిన 41 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. 60 మీటర్ల పొడవైన ఎస్కేప్‌ రూట్‌లో ఏర్పాటు చేసిన స్టీల్‌ పైపు గుండా కార్మికులను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. గుహ లాంటి సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులు బాహ్య ప్రపంచాన్ని కళ్లారా తిలకించి, గుండెనిండా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

ఉత్తరాఖండ్‌లో సిల్‌క్యారా సొరంగంలో సహాయక చర్యలు మంగళవారం పూర్తయ్యాయి. ర్యాట్‌–హోల్‌ మైనింగ్‌ నిపుణులు సొరంగం లోపల మిగిలిన 12 మీటర్ల మేర శిథిలాల డ్రిల్లింగ్‌ పనులు పూర్తిచేశారు. వెంటనే భారీ స్టీల్‌ పైపును ఏర్పాటు చేసి, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కార్మికుల వద్దకు చేరుకున్నారు.
ఇదీ చదవండి: వాళ్లు సొరంగాన్ని జయించారు!

    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top