రోడ్డెక్కిన సిటీ బస్సులు | City Buses Started In Vijayawada And Visakhapatnam | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన సిటీ బస్సులు

Sep 19 2020 8:29 AM | Updated on Sep 19 2020 10:45 AM

City Buses Started In Vijayawada And Visakhapatnam - Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆరు నెలల పాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ సిటీ బస్సులు శనివారం విజయవాడ, విశాఖపట్నంలో రోడ్లపైకి వచ్చాయి. మొదటి రోజు ఉదయం ఆరు గంటల నుంచి వంద బస్సులు పలు రూట్లలో ప్రారంభమయ్యాయి.ఆర్టీసీ అధికారులు కోవిడ్‌ నిబంధనలను సిటీ బస్సులలో కఠినంగా అమలు చేస్తున్నారు. బస్సుల్లో స్టాడింగుకు అనుమతించడం లేదు. ప్రతి స్టాప్ వద్ద ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించిన తరువాతే బస్సులోకి ప్రయాణికులను సిబ్బంది అనుమతించనున్నారు.

అనారోగ్య సమస్యలు ఉన్నవారికి బస్సులోకి అనుమతి లేదని తెలిపారు. ప్రయాణికులు ప్రతి ఒక్కరూ మాస్క్, సామాజిక దూరం పాటించాలని నింబంధనలు విధించారు. ఇక వృద్ధులు, పిల్లలు బస్సు ప్రయాణాలకు అనుమతి నిరాకరించారు. ప్రయాణికుల రద్దీ ఆధారంగా బస్సుల సంఖ్య పెంచనున్న ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలు తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ పరిస్థితులు రాగానే సీనియర్ సిటీజన్లకు రాయితీని వర్తింపు కొనసాగుతుందని తెలిపారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement