రాజంపేట(వైఎస్సార్ జిల్లా): స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో టీడీపీ గూండాల దాడి అంతకంతకూ శ్రుతి మించుతోంది. తమకు అడ్డొస్తే ఎవరిపైనైనా దాడి చేస్తామనే రీతిలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. నామినేషన్ సెంటర్లోకి వెళ్తున్న టీడీపీ మూకల్ని అడ్డుకున్నందుకు ఏకంగా సీఐనే కిందపడేసి దాడికి యత్నించిన ఘటన వైఎస్సార్ జిల్లా రాజంపేటలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. మూకుమ్ముడిగా నామినేషన్ సెంటర్లోకి వెళ్తున్న టీడీపీ బ్యాచ్ను సీఐ హేమసుందర్ అడ్డుకున్నారు. అంతమంది నామినేషన్ సెంటర్లోకి ఎలా వెళ్తారు అంటూ ప్రశ్నించారు. దాంతో తమకే అడ్డు చెబుతావా అంటూ సీఐ హేమసుందర్పై టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. సీఐని సైతం గట్టిగా నెట్టేయడంతో కిందపడిపోయారు.
బ్యాచ్ అంతా కలిసి తోసేయడంతో సీఐ అదుపు చేసుకోలేక కిందపడిపోయారు. దీనిపై ఒక్కసారిగా దుఖం పొంగుకొచ్చిన సీఐ.. ‘మీ కోసం పని చేస్తుంటే తోసేస్తారా?, ‘నన్ను చంపేయండి’ అంటూ ఆవేదనగా అరిచారు. మరి ఇప్పటివరకూ వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడి చేసిన టీడీపీ గూండాలపై కేసులు నమోదు చేయని పోలీసులు.. కనీసం సీఐను తోసేసిన ఘటనపైనైనా కేసు పెడతారో లేదో చూడాలి.
ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన కూటమిలో కుమ్ములాటలు


