
అనంతపురం: అనంతపురంలో దోశ ముక్క గొంతులో ఇరుక్కుని రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. అనంతపురంలోని తపోవనంలో నివాసం ఉండే అభిషేక్, అంజినమ్మ దంపతుల రెండేళ్ల కుమారుడు కుషాల్. శనివారం ఉదయం స్థానిక తపోవనం సర్కిల్‌లోని ఓ హోటల్‌లో తల్లిదండ్రులు దోశ తినిపిస్తుండగా, దోశ ముక్క చిన్నారి గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది.
హుటాహుటిన స్థానిక ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. చిన్నారిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కొద్దిసేపటికే కుషాల్ మృతి చెందాడు. కళ్ల ముందే చిన్నారి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.