పోర్టు పరిసరాల్లో కాలుష్యానికి చెక్‌

Check for pollution in the vicinity of the port - Sakshi

పోర్టు, ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ మధ్య ఎంవోయూ 

సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా విశాఖపట్నం పోర్టు అథారిటీ, ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. పోర్టు చైర్మన్‌ డా.అంగముత్తు గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఎండీ రాజశేఖర్‌రెడ్డి ఈ ఒప్పంద పత్రాలపై శనివారం సంతకాలు చేశారు. విశాఖ నగరంలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు పోర్టు పరిసర ప్రాంతాలలో గాలి కాలుష్యాన్ని తగ్గించటం, కార్బన్‌ ఉద్గారాలను నిలువరించడమే ఈ ఎంవోయూ ముఖ్య ఉద్దేశమని చైర్మన్‌ డా.అంగముత్తు తెలిపారు.

ఒప్పందంలో భాగంగా విశాఖపట్నం పోర్టు పరిసరాలలో గ్రీన్‌ బెల్ట్‌ను అభివృద్ధి చేయడం, పోర్టుకు వెళ్లే ప్రధాన జంక్షన్లలో రోడ్డు డివైడర్ల వద్ద పచ్చదనాన్ని పెంపొందించడం, పోర్టు కార్యాలయాలలో అవసరమైన మేరకు ల్యాండ్‌ స్కేపింగ్‌ చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం తదితర పనులను ఆంధ్రప్రదేశ్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటీఫికేషన్‌ కార్పొరేషన్‌ చేస్తుందని ఎండీ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. పోర్టు డిప్యూటీ చైర్మన్‌ దూబే, చీఫ్‌ ఇంజినీర్‌ వేణుప్రసాద్‌ తదితరులు 
పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top