స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు | ACB Court Extended Remand For Another 14 Days For Chandrababu Naidu In Skill Development Scam Case - Sakshi
Sakshi News home page

Chandrababu Remand Extended: స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు

Oct 5 2023 4:55 PM | Updated on Oct 5 2023 5:19 PM

Chandrababu Remand Extended In Skill Scam Case - Sakshi

సాక్షి, విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌యిన చంద్రబాబు రిమాండ్‌ను ఈ నెల 19 వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. చంద్రబాబు రిమాండ్‌ మరో 14 రోజులు పొడిగిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దీంతో ఆయన మరో 14 రోజులు రాజమండ్రి సెంట్రల్‌ జైలులోనే రిమాండ్‌ ఖైదీగా ఉండనున్నారు. ఇవాళ ఏసీబీ కోర్టు ముందుకు వర్చువల్‌గా చంద్రబాబు హాజరయ్యారు.

కాగా, చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై విచారణను రేపు మధ్యాహ్నానికి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. ఇవాళ కూడా ఇరుపక్షాల వాదనలు హోరాహోరీగా సాగాయి.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు విచారణలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం (ACB Court)లో దర్యాప్తు సంస్థ తరపున అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కీలక ఆధారాలను సమర్పించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో బాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని ఏఏజీ వెల్లడించారు.
చదవండి: స్కిల్‌ స్కాం కేసులో కీలక డాక్యుమెంట్ల సమర్పణ 

.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement