చంద్రబాబుకు చుక్కలు చూపించిన న్యాయవాదులు | Chandrababu Naidu Stopped By Kurnool Advocates Over High Court Issue In Kurnool Municipal Election Campaign | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు చుక్కలు చూపించిన న్యాయవాదులు

Mar 4 2021 10:16 PM | Updated on Mar 5 2021 1:06 AM

Chandrababu Naidu Stopped By Kurnool Advocates Over High Court Issue In Kurnool Municipal Election Campaign - Sakshi

సాక్షి, కర్నూలు: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు నగరంలో పర్యటించిన చంద్రబాబుకు స్థానిక న్యాయవాదులు చుక్కలు చూపించారు. పెద్ద మార్కెట్ వద్ద జరగిన రోడ్డు షోలో పాల్గొన్న చంద్రబాబును న్యాయవాదులు, స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హైకోర్టు కర్నూలుకు రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని నిరసన స్వరాలు వినిపించిన న్యాయవాదులు.. చంద్రబాబు గోబ్యాక్‌ అంటూ ఆందోళన చేపట్టారు. దీంతో  న్యాయవాదులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొని, తోపులాటకు దారి తీసింది. హైకోర్టు విషయంలో చంద్రబాబు వైఖరిపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హైకోర్టుకు మద్దతు తెలపాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement