
అమరావతి: కాపు ఉద్యమ కేసును తిరగతోడాలని యత్నించిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈ కక్ష సాధింపు చర్యపై అటు కాపు నేతలు, ఇటు వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో చంద్రబాబు సర్కార్ వెనకడుగువేసింది. ఆ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది ఆ కేసును హైకోర్టు కొట్టేసినా మళ్లీ పునర్విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసిన రోజు వ్యవధిలోనే దాన్ని వెనక్కి తీసుకుంది చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం,. అదే పనిలో ఆ ఉత్తర్వులు ప్రభుత్వానికి తెలియకుండా జారీ అయ్యాయని సరికొత్త డ్రామాకు తెరలేపింది. అయితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతోనే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుందనేది వాస్తవం.
కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా తునిలో గతంలో చోటుచేసుకున్న ఘటనపై నమోదైన కేసులను ఏకంగా న్యాయస్థానమే కొట్టేసినా సరే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని తిరగదోడే యత్నం చేసింది. ఆ కేసుల పునర్విచారణకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసి కాపు సామాజికవర్గాన్ని తీవ్రషాక్‌కు గురిచేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం కాపుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఎప్పుడో సమసిపోయిందనుకున్న కేసు తిరగదోడి కాపులను తిరిగి ఇబ్బందుల పాల్జేయాలనే కుట్రలను తిప్పికొడతామని కాపు నేతలు, కాపు సామాజికవర్గం వారు హెచ్చరించారు. కుట్రపూరితంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను సహించబోమని, వాటికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు.

విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు