
విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణ అంశంలో కేంద్రం ట్విస్ట్ ఇచ్చింది. ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గడం ఉత్తమాటేనని తేల్చేసింది. దీంతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నాటకాలు.. మోసాలు బట్టబయలు అయ్యాయి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ ఇప్పటిదాకా లభించలేదు. కానీ, అది జరగనివ్వబోమంటూ ఏపీలోని కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రకటనలు చేస్తూ వస్తోంది. అయితే మరోవైపు ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతుండడం చూస్తున్నదే.
ఈ తరుణంలో.. పబ్లిక్ గ్రీవెన్స్‌కు కార్మిక నాయకుడు పాడి త్రినాథ్ రాసిన లేఖకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవాళ బదులిచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో కార్పొరేట్ సంస్థ అయిన RINL ప్రైవేటీకరణ విషయంలో ఎటువంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేయడం గమనార్హం.

కేంద్రం తాజా ప్రకటనపై పోరాట సంఘాలు భగ్గుమన్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలన్నదే మా మొదటి, ప్రధాన డిమాండ్. ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగలేదని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకుంటాం అంటే కుదరదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్‌ను కాపాడాలి.
:::అయోధ్య రామ్, పోరాట కమిటీ కన్వీనర్