తిరుపతిలో డ్రైవర్‌ యాప్‌ కలకలం | Bus Game App Controversy In Tirumala | Sakshi
Sakshi News home page

తిరుపతిలో డ్రైవర్‌ యాప్‌ కలకలం

Jul 22 2021 6:32 PM | Updated on Jul 22 2021 6:53 PM

Bus Game App Controversy In Tirumala - Sakshi

అలిపిరి నుంచి తిరుమలకు బస్సు ప్రయాణం పేరిట విడుదలైన డ్రైవర్‌ యాప్‌ తిరుపతిలో కలకలం సృష్టించింది. ప్లే స్టోర్‌లో రూ.179 చెల్లించి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, గేమ్‌ గెలిస్తే 20 శ్రీవారి లడ్డూలు గెలిచినట్లని నిర్వహకుల ప్రచారం చేశారు.

సాక్షి, తిరుమల: అలిపిరి నుంచి తిరుమలకు బస్‌ డ్రైవింగ్‌ గేమ్‌ పేరిట విడుదలైన ఓ యాప్‌ తిరుపతిలో కలకలం సృష్టించింది. ప్లే స్టోర్‌లో రూ.179 చెల్లించి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, గేమ్‌ గెలిస్తే 20 శ్రీవారి లడ్డూలు గెలిచినట్లని నిర్వహకులు ప్రచారం చేశారు. డ్రైవర్‌ యాప్‌పై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ డ్రైవింగ్‌ యాప్‌పై టీటీడీ విజిలెన్స్‌ విచారణ చేపట్టింది. నిర్వహకుడు సురేష్‌ పరారీలో ఉన్నాడు. ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను అధికారులు డిలీట్‌ చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement