
మనల్ని ఆపేదెవడ్రా.. అని లీడర్ అంటే.. అదే అదనుగా కేడర్ చెలరేగిపోతోంది. కూటమి ప్రభుత్వంలో చట్టం మన చుట్టమే అనుకుంటూ ఆయా పార్టీల కార్యకర్తలు ఇలా బండ్లు, కార్ల నంబర్ ప్లేట్లపై ఫలానా వారి తాలూకా అని రాసుకుని తిరుగుతున్నారు. పోలీసులు మాత్రం మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. నెల్లూరు నగరంలో ఈ చిత్రాన్ని సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు