సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాలకు బెజవాడ దుర్గమ్మ దేవాలయం సిద్ధమైంది. ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 11 నుంచి 20 వరకూ దసరా మహోత్సవాలు జరగనున్నాయి. స్నపనాభిషేకం అనంతరం రేపు(ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. దాంతో పది రోజుల పాటు రోజుకో అలంకారంలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది.
దసరా మహోత్సవాల్లో అమ్మవారి అలంకారాలు
అక్టోబర్ 11 వ తేదీ బాలా త్రిపురసుందరీ దేవి
అక్టోబర్ 12 వ తేదీ గాయత్రీ దేవి
అక్టోబర్ 13 వ తేదీ అన్నపూర్ణాదేవి
అక్టోబర్ 14 వ తేదీ మహాచండీ దేవి
అక్టోబర్ 15 వ తేదీ లలితా త్రిపుర సుందరీ దేవి
అక్టోబర్ 16 వ తేదీ సరస్వతి దేవి (మూలానక్షత్రం)
అక్టోబర్ 17 వ తేదీ మహాలక్ష్మీ దేవి
అక్టోబర్ 18 వ తేదీ దుర్గాదేవి ( దుర్గాష్టమి)
అక్టోబర్ 19వ తేదీ మహిషాసుర మర్ధిని దేవి (మహర్నవమి)
అక్టోబర్ 20వ తేదీ రాజరాజేశ్వరి దేవి (విజయదశమి)
ఇదీ చదవండి: విమానంలోనే సీజేపీ నేతల నిర్బంధం


