‘కులగణన’ నివేదిక సభలో ప్రవేశపెట్టడంపై హర్షం | Sakshi
Sakshi News home page

‘కులగణన’ నివేదిక సభలో ప్రవేశపెట్టడంపై హర్షం

Published Wed, Sep 27 2023 4:23 AM

BC ministers thanked Jagan together - Sakshi

సాక్షి, అమరావతి: కులగణన అంశానికి సంబంధించిన నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టడంపై బీసీ మంత్రు­­లు, ఇతర ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశా­రు. ఈ మేరకు శాసనసభలోని ముఖ్యమంత్రి కా­ర్యా­ల­­యంలో మంగళవారం సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌­రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియ­జేశారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, బీసీ సంక్షేమం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబో­యిన శ్రీనివాస వేణుగో­పాలకృష్ణ, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ,, ఎమ్మెల్యేలు ఎం శంకరనారాయణ, పొన్నాడ సతీష్‌ ఉన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement