
శాసనసభలోని సీఎం చాంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
బీసీ జనగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసన సభలో తీర్మానం చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బీసీ నేతలు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
సాక్షి, అమరావతి: బీసీ జనగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసన సభలో తీర్మానం చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బీసీ నేతలు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో సీఎం జగన్‌ను బుధవారం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, బీసీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిశారు.
బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలు, వెనుకబడిన తరగతులను వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్దుతున్న వైనాన్ని ఆయా వర్గాలకు మరింతగా తెలియజెప్పేలా నాయకులు పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సూచించారు.