సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. హాస్టల్ మెస్‌కు తాళాలు వేసిన అధికారులు.. నిన్నటి నుంచి విద్యార్థులకు హాస్టల్లో విద్యార్థులకు భోజనం పెట్టలేదు. ఫీజు చెల్లిస్తేనే మెస్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. అధికారులు, ప్రభుత్వ తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజు కడితేనే మెస్ ఓపెన్ చేస్తామని అధికారులు చెప్పడాన్ని క్రూరమైన చర్యగా ఎస్‌ఎఫ్‌ఐ ప్రకటించింది.
‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. ఫీజులు చెల్లించలేని దుస్థితిలో విద్యార్థులు ఉన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీలో అనేక సమస్యలు తిష్ట వేసాయి. తక్షణమే సమస్యలు పరిష్కరించాలి హాస్టల్ మెస్‌లను యథావిధిగా కొనసాగించాలి’’ అని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది.


