శ్రీశైలంలో తీవ్ర ఉద్రిక్తత.. గుడి వద్ద గొడ్డలితో దాడి..

Attacks Between Two Factions In Srisailam - Sakshi

సాక్షి, కర్నూలు: శ్రీశైలంలో బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక సత్రం ముందు ఉన్న టీ దుకాణం దగ్గర గొడవ ప్రారంభమైంది. ఈ గొడవలో స్థానికులు, కర్ణాటక వాసల మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం దాడికి దారితీసింది. ఈ క్రమంలో స్థానికులు కర్ణాటక వాసిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. దీంతో హుటాహుటిన దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా, శ్రీశైలంలో కర్నాటకవాసిపై దాడి చేయడం జీర్ణించుకోని కన్నడిలు ఆగ్రహంతో స్థానికంగా ఉన్న షాపులను ధ్వంసం చేసి నిప్పటించారు. ఈ క‍్రమంలో ఆలయ పరిసరాల్లో ఉన్న దుకాణాలు, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పాతాళ గంగ, నంది సర్కిల్, పరిపాలన భవనం ముందు లైన్లల్లోని, తాత్కాలిక షాపులను పూర్తిగా ద్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని గమనించిన ఈఓ లవన్న, జగద్గురువు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 చెన్న సిద్ధరామ పండితారాధ్య, శివాచార్య, కర్ణాటక స్వామిజీలతో మాట్లాడి ప్రత్యేక పోలీస్ బృందాలతో పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top