కిడ్నీ పరిశోధన కేంద్రంపై దుశ్చర్య | Attack on kidney research center | Sakshi
Sakshi News home page

కిడ్నీ పరిశోధన కేంద్రంపై దుశ్చర్య

Jun 8 2024 5:55 AM | Updated on Jun 8 2024 5:55 AM

Attack on kidney research center

పేరులో వైఎస్సార్‌ అక్షరాలు తొలగించిన టీడీపీ కార్యకర్తలు

కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా పలాసలో వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన కిడ్నీ పరిశోధన కేంద్రంపై టీడీపీ కార్యకర్తలు శుక్ర­వారం దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ కేంద్రంపై పేరులో ఉన్న వైఎస్సార్‌ అనే అక్షరాలను తొలగించారు. శిలాఫలకాలను, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన శిలాఫలకాలను తొలగించారు.

ఆస్పత్రి రెండు విభాగాలుగా ఉన్న భవనాలపై ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్‌ సెంటర్‌ అనే తెలుగు, ఇంగ్లిష్‌ అక్షరాల్లో వైఎస్సార్‌ అనే అక్షరాలను తీసేశారు. రాజకీయాలకు అతీతంగా ఉద్దాన ప్రాంతంలో ఉన్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలతో పాటు ఆంధ్రా–ఒడిశా సరిహ­ద్దుతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న కిడ్నీ వ్యాధిగ్ర­స్తులు ఇక్కడ వైద్యసేవలు పొందుతున్నారు. 

అన్ని రకాల పరీక్షల నుంచి డయాలసిస్, అరుదైన ఆపరేషన్‌లకు ఈ ఆస్పత్రి నెలవుగా మారింది. ఉచితంగా స్కానింగ్‌ చేసి మందులు ఇస్తున్నారు.  ఈ చర్యను మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తీవ్రంగా ఖండించారు.

Advertisement
 
Advertisement
Advertisement