‘సామాజిక న్యాయం అనే మాటకు విలువిచ్చిన ఏకైక సీఎం.. వైఎస్‌ జగన్’

AP:Jogi Ramesh launches Minitres Bus Tour Posters YSR  Trade Union - Sakshi

సాక్షి, విజయవాడ: వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర పోస్టర్‌ను మంత్రి జోగి రమేష్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.ఆటోల ద్వారా వైఎస్సార్‌  ట్రేడ్ యూనియన్  బస్సు యాత్ర ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ మేరకు మంత్రి జోగి రమేష్, పూనూరు గౌతమ్ రెడ్డి పోస్టర్లు అంటించారు.

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి 29 వరకూ సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర సాగనున్నట్లు తెలిపారు. బహుజనులంతా జయహో జగనన్న అని నినదిస్తున్నారని అన్నారు. భారత దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా సామాజిక న్యాయం పాటించలేకపోయారని, సామాజిక న్యాయం అనే మాటకు విలువిచ్చిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. స్పీకర్ నుంచి నామినేటెడ్ పోస్టుల వరకూ సామాజిక న్యాయం పాటించారన్నారు.

అలాగే 75% శాతం సామాజిక న్యాయం అమలు చేశారన్నారు. సీఎం జగన్‌ సామాజిక విప్లవ కారుడని, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ బస్సుయాత్రను దిగ్విజయం చేస్తామని తెలిపారు. బస్సుయాత్రలో 17 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారన్నారు. నాలుగు జిల్లాల్లో బహిరంగ సభలు వేలమందితో నిర్వహిస్తామని పేర్కొన్నారు.  ఇక సామాజిక న్యాయభేరికి వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ పూర్తి సహకారం అందిస్తున్నట్లు పూనూరు గౌతమ్‌ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆటోల ద్వారా ప్రచారం చేస్తామని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top