AP Teacher Promotion Schedule Released - Sakshi
Sakshi News home page

AP: టీచర్ల పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల

Oct 4 2022 8:44 AM | Updated on Oct 4 2022 1:32 PM

AP Teacher Promotion Schedule Released - Sakshi

వీటిపై ఉన్న అభ్యంతరాలను ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 8వ తేదీలోగా తెలపాల్సి ఉంటుంది. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఈ నెల 9వ తేదీన పరిశీలించి తుది సీనియారిటీ జాబితాను 10న  విడుదల చేస్తారు.

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాల టీచర్ల పదోన్నతుల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్స్, గ్రేడ్‌–2 హెడ్‌మాస్టర్ల పదోన్నతుల షెడ్యూల్‌ను పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ విడుదల చేశారు. ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్స్‌ ప్రాథమిక సీనియారిటీ జాబితాను ఈ నెల 7వ తేదీన వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
చదవండి: అలా.. చక్కబడి! 

వీటిపై ఉన్న అభ్యంతరాలను ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 8వ తేదీలోగా తెలపాల్సి ఉంటుంది. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఈ నెల 9వ తేదీన పరిశీలించి తుది సీనియారిటీ జాబితాను 10న  విడుదల చేస్తారు. గ్రేడ్‌–2 పోస్టుల ప్రమోషన్లను ఈ నెల 11న, స్కూల్‌ అసిస్టెంట్లు దానికి సమానమైన ఇతర పోస్టుల పదోన్నతులను ఈ నెల 12, 13 తేదీల్లో విడుదల చేస్తారు.  

Advertisement
 
Advertisement
Advertisement