కోవిడ్‌ వల్ల జనగణన–2021 వాయిదా

AP Population Census-2021 postponed due to covid-19 - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 వల్ల జనగణన–2021, సంబంధిత పనులు వాయిదా పడ్డాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలయం తెలిపింది. రాష్ట్రాలవారీగా జనగణన–2021 ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియజేయాలంటూ విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్‌ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి సమాధానమిచ్చిన రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలయం జనగణనకు సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. కొత్త తేదీలను నిర్ణయించలేదని వివరించింది.

జనగణన–2021 కోసం 2010 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్‌ 31 వరకు ఉన్న మ్యాపింగ్‌ను, సరిహద్దులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, అయితే కోవిడ్‌–19 వల్ల జనగణన వాయిదా పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి 31, 2021 వరకు ఈ తేదీ ని పొడిగించామని జనగణన పూర్తయ్యే వరకు మ్యాపింగ్, సరిహద్దుల్లో మార్పులు చేయొద్దని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించిందని తెలిపింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top